పెళ్లికి ముందే తొలి పూజ చేసిన వరుణ్ తేజ్, లావణ్య.. ఫొటోలు వైరల్

by Nagaya |
పెళ్లికి ముందే తొలి పూజ చేసిన వరుణ్ తేజ్, లావణ్య.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏడేళ్ల డేటింగ్‌కు పులిస్టాఫ్ట్ పెట్టి దంపతులు కాబోతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. మూడు నెలల క్రితమే అధికారికంగా అంగరంగ వైభవంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ స్టార్ట్ కపుల్స్ నాటి నుంచి రోజూ మీడియాలో నానుతూనే ఉన్నారు. తాజాగా వినాయక చవితి పూజ చేసి వార్తల్లోకెక్కారు. తమ ఇంట్లోనే కొణిదల నాగబాబు ఆయన భార్య పద్మజ, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విఘ్నేశ్వరునికి పూజలు చేశారు. పూజ అనంతరం తీసుకున్న ఫొటోలను వరుణ్ తేజ్ తన ఇన్ స్టాలో అభిమానులకు షేర్ చేశారు. “హ్యాపీ వినాయక చవితి. అందరికీ ఆరోగ్యం, సౌభాగ్యం ఉండాలని కోరుకుంటున్నా. నిహారిక కొణిదెల నిన్ను మిస్ అవుతున్నా” అంటూ వరుణ్ తేజ్ క్యాప్షన్ పెట్టారు.

కాగా, పూజల్లో నిహారిక మిస్ అయింది.మరోవైపు వరుణ్, లావణ్య పెళ్లికి ముందే గణనాధుడికి పూజ చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా.. ముందుగా విఘ్నాలు తొలిగిపోవాలని వినాయకుడికే పూజలు చేయడం ఆనవాయితి. ఇదే మాదిరిగా ఈ కాబోయే దంపతులు ముందుగా ఏకదంతునికి పూజలు చేయడం వల్ల వారి సంసార జీవితం సంతోషంగా ఉండబోతుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed