తండ్రి కాబోతున్న వరుణ్.. బేబీబంప్‌పై ముద్దుపెడుతూ.. సమంత పోస్ట్ వైరల్

by Disha Web Desk 9 |
తండ్రి కాబోతున్న వరుణ్.. బేబీబంప్‌పై ముద్దుపెడుతూ.. సమంత పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం హీరో టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ సరసన నటిస్తున్నాడు. గతేడాది బవాల్‌ అనే సినిమాలో జాన్వీ కపూర్ సరసన నటించి.. భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల భారీ రెస్పాన్స్ లభించింది.

ప్రస్తుతం వరున్ ధావన్.. కీర్తి సురేష్ సినిమాతో పాటు ‘స్ట్రీ-2’ అనే హారర్ మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ హీరో మూడేళ్ల క్రితం ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరో వరుణ్ ధావన్‌ తన ఫ్యాన్స్ కు ఓ శుభవార్త చెప్పాడు. వరుణ్ ధావన్ తండ్రి కాబోతున్నట్లు ఇన్‌స్టా వేదికన ప్రకటించాడు. వరుణ్ సతీమణి బేబీ బంప్‌పై ముద్దు పెడుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి..

‘మేము పేరెంట్స్ కాబోతున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు మాపై ఉండాలంటూ’ వరుణ్ ధావన్ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా.. జాన్వీ కపూర్, మౌని రాయ్, సమంత, కరణ్ జోహార్, భూమి పెడ్నేకర్, వాణి కపూర్, అర్జున్ కపూర్, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మలైకా అరోరా, మనీష్ పాల్ వరుణ్ ధావన్ - నటాషాకు సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలుపుతున్నారు .


Next Story

Most Viewed