అంబటి రాంబాబుపై మండిపడుతూ చిరంజీవిని పొగిడిన వర్మ

by Dishanational2 |
అంబటి రాంబాబుపై మండిపడుతూ చిరంజీవిని పొగిడిన వర్మ
X

దిశ, సినిమా: ఇటివల రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల రెమ్యునరేషన్‌లపై కామెంట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందించి ‘సినిమా హీరోల రెమ్యూనరేషన్ గురించి రాజ్యసభలో మాట్లాడడం ఏంటి? ఇంతకుమించిన పెద్ద సమస్యలే లేవా’ అంటూ మండి పడ్డాడు. దీంతో చిరు చేసిన కామెంట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది.

అయితే ఇదే విషయంపై తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ వైరల్ కామెంట్ చేశాడు. ‘రెమ్యునరేషన్ అనేది మార్కెట్ రియాలిటీ. అది నిర్మాత, హీరోకి మధ్య జరిగే అంతర్గత ఒప్పందం. మార్కెట్‌లో ఎంత రికవరీ ఉంది. సినిమాకు ఎంత అవుతుంది. అనే దాని మొత్తంపై రెమ్యునరేషన్ ఢిపెండ్ అవుతుంది. కానీ అది బయటవాళ్లకు తెలీదు. విజయసాయిరెడ్డి ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలీదు. ఒక సినిమాకు చెప్పారా? మొత్తం ఫిలిం ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని చెప్పారా? నేను చూడలేదు. కానీ రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి చెప్పిన దాని నేను ఏకీభవిస్తాను. అలాగే హీరోలు చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది చాలా పెద్ద బూతు.

ఇక నేను ‘బ్రో’ సినిమా చూడలేదు. కానీ అంబటి రాంబాబు వివాదం గురించి విన్నాను. అది ఎంత స్టుపిడ్ అంటే.. ప్రతి ఒక్కరి మీద వందల మీమ్స్ వస్తుంటాయి. చివరకు గాంధీని కూడా వదలకుండా మీమ్స్ పెడుతుంటారు. అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు సినిమాలో ఏదో చూపిస్తే ఎందుకంత రియాక్ట్ అవ్వడం. అంబటి రాంబాబు సీన్ కూడా నేను చూడలేదు. వేరే పేరు బదులు నా పేరే పెట్టొచ్చు కదా అని రాంబాబు ఏదో అన్నారు. ఇది చాలా స్టుపిడ్ థింగ్ అని నా అభిప్రాయం. దాని గురించి రచ్చ చేయడం అనవసరం. అలాంటివి నా మీద రోజుకు వెయ్యి చూస్తా. వాళ్లు ఎవ్వరినీ వదలరు’ అంటూ రాంబాబుపై మండిపడ్డాడు. మొత్తానికి చిరు, పవన్‌లకు కొంత సపోర్ట్‌గా రెస్పాండ్ అయ్యాడు వర్మ.



Next Story

Most Viewed