స్టేజ్ మీదనే ఏడ్చేసిన హీరోయిన్.. నేను అలాంటిదాన్ని కాదు వదిలేయండని మీడియాకు రిక్వెస్ట్

by Sujitha |
స్టేజ్ మీదనే ఏడ్చేసిన హీరోయిన్.. నేను అలాంటిదాన్ని కాదు వదిలేయండని మీడియాకు రిక్వెస్ట్
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ వైష్ణవి చైతన్య 'బేబి' సినిమాతో వెండితెరపై మెరిసింది. విమర్శకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆ పాత్రలో జీవించేసింది. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ మూవీ తనకు కెరీర్ పరంగా ఎంత హెల్ప్ చేసిందో.. పర్సనల్ గా అంత డిస్ అడ్వాంటేజ్ గా మారిపోయింది. ఈ చిత్రంలో ఇద్దరితో ప్రేమగా నటించాల్సి రావడంతో యూత్ ఈ అమ్మాయిని నిజంగానే చీటర్ అని, మోసగత్తే అని ఓన్ చేసుకున్నారు. సినిమా అని వదిలేయకుండా బయట కూడా పచ్చి బూతులు తిడుతున్నారు. కాగా ఈ విషయాన్ని తన రెండో సినిమా 'లవ్ మి' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్తూ బాధపడింది.

' లం** ' అనే బూతు మాటలు కూడా వాడుతున్నారని.. అలాంటి కామెంట్స్ తనతోపాటు తన కుటుంబాన్ని బాధిస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆమె మాటలకు సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఎమోషనల్ అయిపోయాడు. కాగా ఇప్పటికే ఈ మూవీ రివ్యూ వచ్చేయగా మరో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Next Story