ప్రపంచాన్ని కబ్జ చేస్తాం.. హీరో ఉపేంద్ర కామెంట్స్ వైరల్

by Disha Web Desk 17 |
ప్రపంచాన్ని కబ్జ చేస్తాం.. హీరో ఉపేంద్ర కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరో ఉపేంద్ర, శ్రీయా శ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం 'క‌బ్జ'. ఆర్‌.చంద్రు తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 17న రిలీజ్ కానుండగా.. ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ బ్యానర్స్‌పై తెలుగులో ప్రేక్షకుల ముందుకొస్తుంది.

కాగా శనివారం ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ విడుదలచేసే కార్యక్రమంలో మాట్లాడిన ఉపేంద్ర.. మూడేళ్లు క‌ష్టప‌డిన తమ చిత్రానికి అంద‌రి స‌పోర్ట్‌ కావాలన్నాడు. కేవలం పాన్ ఇండియానే కాదు.. గ్లోబ‌ల్‌ను క‌బ్జ చేయ‌బోతున్నామంటూ సపోర్ట్ చేసిన వారందరికీ థాంక్స్ చెప్పాడు. అలాగే 'సినిమా గ్లోబ‌లైజ్ అయింది. ఆడియెన్స్ అప్‌డేట్ అయ్యారు. మేము కూడా అప్‌డేట్ కావాల‌ని భావించి మంచి టీమ్‌ను ఏర్పాటు చేసుకుని మూవీ చేశాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బిగ్ హిట్ చేయాలి' అని దర్శక నిర్మాతలు కోరారు.

చివరగా కార్యక్రమానికి హాజరైన సాయినాథ్, హ‌నుమంత రెడ్డి, శ్రీయ, విశ్వక్ సేన్, డి.వి.వి.దానయ్య, చంద్ర బోస్‌, ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్, వరదరాజు, అలంకార్‌లు మాట్లాడుతూ ఈ మూవీ ప్రేక్షకుల అంచ‌నాల‌ను మించి ఉంటుందని, తప్పకుండా బ్లాక్ బ‌స్టర్ అవుతుందన్నారు.


Next Story