అప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.. ఈమె ఎవరంటే?

by Prasanna |
అప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.. ఈమె ఎవరంటే?
X

దిశ, సినిమా: సినిమాల్లో ఒక్కసారైనా కనిపించాలని చాలా మందికి ఆశ ఉంటుంది. అయితే, ఆ అదృష్టం అందరికి ఉండదు. అలాగే సినిమాల్లోకి వెళ్లిన వారు కూడా ఒకటి అవ్వాలని .కలగా పెట్టుకుంటే.. చివరికి ఇంకొక రకంగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు చెప్పబోయే ఈ మలయాళ కుట్టి కథ కూడా అంతే.

ఈ ముద్దుగుమ్మ నాన్న ఓ సినిమాటోగ్రాఫర్.. ఈమె డైరెక్టర్ అవ్వాలని సినిమాల్లోకి అడుగుపెట్టి .. అనుకోకుండా హీరోయిన్ అయింది. ఇప్పటికే తమిళ మూవీస్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదండి.. మాళవిక మోహనన్.

‘పట్టామ్ పోల్’ మూవీతో సినీ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కన్నడంలో ‘నన్ను మట్టు వరలక్ష్మీ’.. హిందీలో ‘బీయాండ్ ది క్లౌడ్స్’ అనే చిత్రంలో నటించింది. 2013లో సినీ కెరీర్ ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తుంది. అలాగే తెలుగులో ప్రభాస్, మారుతీ కాంబోలో వస్తున్న ‘రాజా సాబ్’ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. హిందీలో ఈమె నటించిన మూవీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నెటిజెన్స్ ఆ ఫోటోను చూసి ఆ సినిమాలో చేసింది మాళవిక నా అంటూ షాక్ అవుతున్నారు.Next Story

Most Viewed