- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన నటుడు తేజ్.. ఫొటోలు వైరల్
దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు, బుల్లితెర నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అలాగే పెళ్లి తర్వాత చిన్న చిన్న గొడవలకు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, బుల్లితెర నటుడు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. నా పేరు మీనాక్షి సీరియల్ నటుడు తరుణ్ తేజ్ అందరికీ సుపరిచితమే. వరుసగా సీరియల్స్ చేస్తూనే మూవీస్‌లో చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. బిగ్ స్క్రిన్‌పై పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ పలు సీరియల్స్ చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తరుణ్ తేజ్ ఫుల్ బిజీ బిజీ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక తరుణ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వివాహం బంధం లోకి అడుగుపెట్టాడు.
తన సోషల్ మీడియాలో, యూట్యూబ్ చానల్‌లో అన్ని ఫ్యాన్స్‌తో పంచుకునే తరుణ్ పెళ్లి విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. కానీ తరుణ్ హల్దీ ఫొటోల కానుంచి.. పెళ్లికి సంబంధించిన ఫొటోలన్నీ బయటకు రావడంతో అవి చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అన్ని చెప్పిన నువ్వు పెళ్లి విషయాన్ని ఎందుకు దాచావు మాకు ఏదో డౌట్ వస్తుందని అంటున్నారు. అలాగే కొందరు ఫొటోలు షేర్ చేయకపోతే చేయకపోయావు.. కానీ జీవితాన్ని విడాకుల వరకు తీసుకెళ్లకుండా సంతోషంగా జీవించు అని కామెంట్లు పెడుతున్నారు.