మెగాస్టార్‌కు విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో.. ‘MEGA 156’ లో అదిరిపోయే ట్విస్ట్

by Disha Web Desk 7 |
మెగాస్టార్‌కు విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో.. ‘MEGA 156’ లో అదిరిపోయే ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా కుర్రహీరోలకు పోటీగా నిలుస్తున్నాడు మెగా స్టార్ చిరంజీవి. రీసెంట్‌గా వచ్చిన ‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత.. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దసరా సందర్భంగా మంగళవారం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ముల్లోకాల నేపథ్య కథతో రూపొందుతున్న ఈ మూవీలో మోగాస్టార్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.

కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసిన ఈ చిత్రాన్ని రూ. 200కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో చిరుకు విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో రానా నటించనున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతే కాకుండా హాలీవుడ్ మూవీ ‘లోకి’ తరహా పాత్రలో రానా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఇదే కనుక నిజం అయితే.. ఈ సినిమాపై అంచనాలు భారీ ఎత్తున పెరిగే అవకాశాలు లేకపోలేదు.

Next Story

Most Viewed