- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎట్టకేలకు ప్రియుడు కౌశల్‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అక్ష పార్ధసాని నితిన్ ‘యువత’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ పోతినేని కందిరీగ, రైడ్, బెంగాల్ టైగర్, డిక్టేటర్ వంటి చిత్రాల్లో నటించి తెలుగులో మంచి క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత ఇక్కడ ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాటోగ్రాఫర్ కౌశల్‌ను ప్రేమించింది.
తాజాగా, అక్ష పెద్దలను ఒప్పించి తన ప్రియుడు కౌశల్‌ను పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో పెళ్లి కొడుకు గెటప్‌లో కౌశల్ మండపానికి వెరైటీగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన సినిమాటోగ్రాఫర్ కావడంతో షూటింగ్‌కు వాడే కెమెరా క్రేన్ మీద కూర్చుని పెళ్లి లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అవి చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.