- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సెట్‌లో 8 గంటలు అలా చేశాక.. భర్తతో శృంగారం చేయలేకపోయానంటూ టాలీవుడ్ నటి బోల్డ్ కామెంట్స్

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోస్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఇటీవల అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ‘‘ అర్ధరాత్రి ఆడదానికి ఏం పని నడిరాత్రి వారికి రోడ్లపైన తిరగాల్సిన అవసరం లేదు. అలాగే వారు ధరించే దుస్తుల వల్లే దేశంలో రేప్ సంఘటనలు జరుగుతున్నాయి’’ అంటూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై చిన్మయి ఫైర్ అవడంతో ఆమెపై కేసు కూడా నమోదైంది. దీంతో కొద్ది రోజుల నుంచి అన్నపూర్ణమ్మ వార్తల్లో నిలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్నపూర్ణమ్మ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా భర్త బ్రాహ్మణ కులానికి చెందిన వారు. ఆయన చాలా మంచి వారు నా కెరీర్ సవ్యంగా సాగడానికి ఆయనే ముఖ్య కారణం. లేకపోతే 600 పైగా సినిమాలు చేసే దానిని కాదు. కానీ మా మధ్య శృంగార జీవితం అంతంత మాత్రంగానే సాగేది. షూటింగ్‌లో రోజంతా పనిచేయడం వల్ల ఇంటికి వచ్చేసరికి నేను అలిసిపోయేదాన్ని. ఇంటికి రాగానే వెంటనే నిద్ర పట్టేది. ప్రతీ రోజు ఏదో ఒక షూటింగ్ ఉండేది. దాదాపు 8 గంటలపాటు షూటింగ్‌లో ఉండేవాళ్లం. సీనియర్ నటుల చూపంతా మాపైనే ఉండేది కాబట్టి భయంభయంగా ఉండేవాళ్లం. ఇక అలాంటి పరిస్థితుల నుంచి ఇంటికి వచ్చాక భర్తతో శృంగారానికి ఓపిక ఉండేది కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.