నేడు ప్రేమ ఎంత మధురం హీరో వెంకట్ శ్రీరామ్ పుట్టినరోజు

by Prasanna |
నేడు ప్రేమ ఎంత మధురం హీరో వెంకట్ శ్రీరామ్ పుట్టినరోజు
X

దిశ, సినిమా: సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన వెంకట్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు, శతమానం భవతి తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బుల్లి తెరకు కూడా పరిచయమయ్యాడు. పలు సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా చేసాడు. ప్రేమ ఎంత మధురం సీరియల్ కి అయితే.. ఒక వైపు ప్రొడ్యూసర్ గా ఉంటూ.. ఇంకో వైపు తనే హీరోగా చేస్తూ.. పెద్ద బాధ్యత తీసుకుని సక్సెస్ అయ్యాడు. ఈ ఒక్క సీరియల్ తో తన కెరియర్ పూర్తిగా మారిపోయింది. ప్రేమకు వయస్సు తో సంబంధం లేదంటూ ఈ కథతో చాటి చెప్పాడు. ఈ సీరియల్లో ఆర్య వర్ధన్ పాత్రలో అదరగొట్టాడు. అను, ఆర్య లవ్ స్టోరీకి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇదే క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నాడు. నేడు తన 48 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.Next Story

Most Viewed