నేడు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పుట్టినరోజు

by Prasanna |
నేడు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పుట్టినరోజు
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమాలకు కొంత కాలం దూరంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలోని దాదాపు అందరు ప్రముఖ హీరోలతో పనిచేసిన విజయశాంతి.. హీరోలలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన విజయశాంతి కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ వచ్చిన విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ మూవీలో కనిపించలేదు. ముందు ముందు సినిమాలు తీస్తుందో ? లేక సినిమాలకు దూరంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు విజయశాంతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా విజయశాంతికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.Next Story

Most Viewed