NTR : నేడు నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి

by Prasanna |
NTR : నేడు నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి
X

దిశ, సినిమా: ‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు’ .. అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్. ‘నందమూరి తారక రామారావు’ పేరు చెప్పగానే ఇప్పటికీ ఎంతో మంది ఎమోషనల్ అవుతారు. ఆయన కేవలం సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు.. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం. ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం.. సంక్షేమ పథకాలకు తారకమంత్రం అన్న ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నటుడిగా పేరుగాంచిన ఆయన అనేక పౌరాణిక, జాతి, సాంఘిక సినిమాలతో పాటు తెలుగు జానపద పాత్రలలో రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో కూడా అలరించాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించారు. నేడు ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు.

Next Story

Most Viewed