మెగా 156 ప్రాజెక్ట్‌లో మరో ముగ్గురు హీరోయిన్లు.. మొత్తం ఎంత మంది ముద్దుగుమ్మలో తెలుసా..?

by Disha Web Desk 7 |
మెగా 156 ప్రాజెక్ట్‌లో మరో ముగ్గురు హీరోయిన్లు.. మొత్తం ఎంత మంది ముద్దుగుమ్మలో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి తాజా సినిమా ‘#MEGA 156’. వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ విజయదశమి రోజు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషియో ఫాంటసీ చిత్రంగా రానున్న ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని టాక్. ఇందులో విలన్‌గా రానా దగ్గుబాటి కనిపించనున్నట్లు తెలుస్తుండగా.. ఇప్పటికీ ఇందులో హీరోయిన్లుగా అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే.. వీరిద్దరితో పాటు మరో ముగ్గురు ముద్దు గుమ్ములు ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నరట. అంటే దీంతో మొత్తం ‘#MEGA 156’ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు అని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే.. మిగిలిన ముగ్గురు హీరోయిన్ల పేర్లు మాత్రం ఇంక తెలియలేదు.

Next Story