అలాంటి ఆలోచనలు ఉన్నవారిని వదిలేయాలి హీరోయిన్ చార్మి షాకింగ్ పోస్ట్..

by Hamsa |
అలాంటి ఆలోచనలు ఉన్నవారిని వదిలేయాలి హీరోయిన్ చార్మి షాకింగ్ పోస్ట్..
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ చార్మీ కౌర్ ‘తోడు కావాలి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ అమ్మడు కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా పరిచయం అయి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించి సినీ ప్రియులను అలరించింది. అయితే చార్మి జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పేసింది. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమై నిర్మాతగా రాణిస్తోంది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్-2 సినిమా నిర్మాణ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం పలు ఎమోషనల్ పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.

అంతేకాకుండా ఆమె డైరెక్టర్ పూరి జగన్నా‌థ్‌లో రిలేషన్‌లో ఉందంటూ గత కొద్ది కాలంగా పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, చార్మీ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ నెగిటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తులను వదిలేయాలి. అలాంటి మైండ్‌సెట్‌తో ఉన్నవారు అవే ఆలోచనలతో ఉంటారు. కానీ నాకు మాత్రం ఫోకస్ పెట్టడానికి చాలా పనులు ఉన్నాయి’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం చార్మి పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారు ఆమెకు ఏమైంది ఎందుకు ఇండైరెక్ట్‌గా ఇలాంటి పోస్ట్ పెట్టిందని చర్చించుకుంటున్నారు.




Next Story

Most Viewed