ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే!

by Disha Web |
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం థియేటర్లలో పెద్ద పెద్ద హీరోల సినిమాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. చిన్న చిన్న హీరోల సినిమాలకు థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపడం లేదు. దీంతో చిన్న సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక మంచి స్టోరీ, బడ్జెట్ ఉన్న సినిమాలు అయితేనే థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక అలాంటి సరికొత్త స్టోరీతో ఈ శుక్రవారం మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో..

* ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా, కయాదు లోహార్ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'అల్లూరి'. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.

* నాగశౌర్య, షెర్లీ సేటియా జంటగా నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారీ'. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రినికి అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించారు.

* ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం'దొంగలున్నారు జాగ్రత్త'. ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా కనిపించనుంచి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో క్యూరియోసిటీని పెంచేశాయి. ఇక ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed