Oscars 2024: రేసులో ఈ సారి 12 భారతీయ సినిమాలు..

by Dishafeatures1 |
Oscars 2024:  రేసులో ఈ సారి 12 భారతీయ సినిమాలు..
X

దిశ, సినిమా: సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ పురస్కారాలు ఒకటి. తమ సినీ ప్రయాణంలో ఒక్కసారైనా ఈ అవార్డు అందుకోవాలని ప్రతి ఒక నటీనటులు, దర్శకనిర్మాతలు కలలు కంటారు. కనీసం ఈ అవార్డు నామినేషన్లలో అర్హత సాధించిన గొప్ప విషయంగానే భావిస్తారు. కాగా ఇక ఇప్పుడు ఈ ఏడాది ఆస్కార్ సందడి మొదలైంది.ఆస్కార్ 2024 కి భారతదేశం నుంచి పలు చిత్రాలు ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కాగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన (ఎఫ్ఎఫ్ఐ) వివిధ భాషలు, జానర్స్ నుంచి 22కి పైగా ఎంట్రీలను అందుకుంది. చిత్రనిర్మాత గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని 17 మంది సభ్యుల జ్యూరీ వాటిని చెన్నైలో సమీక్షిస్తుంది. తుది ఎంపికపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈసారి ఆస్కార్ అవార్డు కోసం ఎంపిక చేయబడిన చిత్రాలు మొత్తం 12. అవేంటో చూద్దాం.

1. ది స్టోరీ టెల్లర్ (హిందీ)

2. సంగీత పాఠశాల (హిందీ)

3. శ్రీమతి ఛటర్జీ vs నార్వే (హిందీ)

4. డంకీ (హిందీ)

5. 12th ఫెయిల్ (హిందీ)

6. విడుతలై పార్ట్ 1 (తమిళం)

7. ఘూమర్ (హిందీ)

8. దసరా (తెలుగు).

9. జ్విగాటో (హిందీ)

10. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ)

11. కేరళ కథ (హిందీ).

12. 2018 (మలయాళం),

Next Story