- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రేక్షకులు గర్వపడేలా ఈ సినిమా ఉంటోంది: నిర్మాతలు

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సిద్దు ముద్దా రినైసన్స్ పిక్చర్స్ పై నిర్మించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని చిత్ర విశేషాలను పంచుకున్నారు.
‘దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ నాకు, వరుణ్‌కి చాలా నచ్చింది. దాన్నే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్‌గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నప్పుడు, నేను, వరుణ్ కలిసి కథ విన్నాం. నచ్చటంతో వెంటనే సినిమా చేయాలని అనుకున్నాం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీలో చాలా గ్రాండ్ రూపొందించాం. ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏం చెప్పారో అదే తీశారని ప్రసంశించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వారు చాలా సపోర్ట్ చేశారు. ప్రేక్షకులు గర్వపడేలా వుంటుంది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.