- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారే నా స్ఫూర్తి, కెరీర్ లో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను : మృణాల్ ఠాకూర్.

దిశ, సినిమా: ‘సీతారామం’ ద్యారా తెలుగు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ మొదటి చిత్రం తోనే తన అందం నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ప్రజంట్ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ‘సీతారామం’ మూవీ ఎన్నో గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది అంటూ తెలిపింది.. ‘ నా జీవితానికి ఒక మంచి మలుపు ఇచ్చిన ఈ సినిమా ‘సీతారామం’. నాతో పాటుగా నటించిన దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్న ద్వారా కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. రష్మిక ఎనర్జీని చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఎన్ని గంటలు పని చేసినా ఆమెలో అలసట కనిపించదు. ఇక పాత్రల ఎంపికలో ఆమె చాలా ప్రత్యేకం.
ఈ మూవీలో ఆఫ్రిన్ అనే అమ్మాయి క్యారెక్టర్ లో చేయాలంటే చాలా ధైర్యం కావాలి. నన్ను అడిగితే ఆ పాత్రను ఆమె తప్ప మరెవరూ చేయలేరు. ఇక దుల్కర్ సల్మాన్ గురించి ఎంత చెప్పిన తక్కవే అవుతుంది. భాషతో సంబంధం లేకుండా మంచి పాత్ర దొరికితె వెంటనే ఒప్పుకోవడం సినిమా పట్ల ఆయనకున్న పాషన్‌కు నిదర్శనం. ఏ జోనర్ చిత్రంలోనైనా ఆయన పర్‌ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. కెరీర్‌పరంగా నేను వారిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను’ అని తెలిపింది మృణాల్ ఠాకూర్.