వర్షాకాలం వచ్చేసింది.. పిల్లలకు అంటు వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!

by Samataha |
వర్షాకాలం వచ్చేసింది.. పిల్లలకు అంటు వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!
X

దిశ, సినిమా : వర్షాకాలం వస్తే చాలు పేరెంట్స్ చాలా భయపడి పోతుంటారు. ఎందుకంటే ఈ సీజన్‌లో త్వరగా అంటు వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు వైద్యులు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, పిల్లల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారికి ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. అందువలన ఈ వర్షాకాలంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారిని అంటు వ్యాధుల నుంచి ఎలా కాపాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షకాలంలో పిల్లలను ఎక్కవగా చల్లగా ఉంచకుండా వెచ్చగా ఉండేలా చూడాలి. కూలర్, ఫ్యాన్స్ వాడటం తగ్గించాలి. ఇంటి వాతావరణాన్ని వెచ్చగా మార్చుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో తేమ ఎక్కువగా ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకుతాయి. ముఖ్యంగా పేరెంట్స్ వర్షాకాలంలో పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వారు తినే ఆహారం, ధరించే దుస్తుల విషయంలో చాలా కేరింగ్ తీసుకోవాలి. రోజూ ఉదయం నీటిని వేడి చేసి చల్లార్చి వాటిని పిల్లల చేత తాగించాలి. వారు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. బయటకు వెళ్తే రెయిన్ కోట్, గొడుగు తప్పని సరిగా తీసి కెళ్లాలి. వేడి నీటితోనే స్నానం చేయించాలి. తడి బట్టల మీద అస్సలే ఉంచకూడదు. కాటన్ దుస్తులను వాడటం చాలా మంచిది.

ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వలన ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. అందువల్ల దోమల నుంచి కాపాడాలి. దోమల తెర వాడటం, ఇంటిని శుభ్రంగా, ఎక్కడ నీరు నిల్వకుండా చూసుకోవాలి. అంతే కాకుండా పిల్లలకు ఒంటి నిండా ఉండే దుస్తులను మాత్రమే వేయాలి.దీరని వలన దోమల నుంచి తప్పించుకోవచ్చు. ఇక ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ మాత్రమే పెట్టాలి. స్ట్రీట్ పుడ్‌కు చాలా దూరంగా ఉంచడం మంచిది, ముఖ్యంగా ఈ సీజన్‌లో పిల్లలకు దానిమ్మా, బొప్పాయి వంటి సీజనల్ ఫ్రూట్స్ అందివ్వడం ఆరోగ్యానికి మంచిది. అలాగే వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా వారికి ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్ ఇవ్వాలి.

Next Story

Most Viewed