- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
థియేటర్లలోకి వచ్చి కొన్ని నెలలు అవుతున్న ఓటీటీకి రాని సినిమాలు ఇవే..!

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. ఎంత సూపర్ హిట్ సినిమా అయిన కొన్ని రోజుల్లోనే ఓటీటీలో దర్శనమిచ్చి అక్కడ కూడా ప్రతాపం చూపించుకుంటున్నాయి. కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజై నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే.. కొన్ని సినిమాలు థియేటర్‌లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే నెలన్నర సమయంలో, అదే యావరేజ్ లేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే రెండు మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ, రిలీజై రెండు, మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఓటీటీకి రాని సినిమాలు ఏవో ఇప్పుడు చుద్దాం.
కనెక్ట్: నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘కనెక్ట్’. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుందని వార్తలు వచ్చాయి కానీ, ఈ మూవీ ఇప్పటి వరకు ఓటీటీ ప్లాట్ ఫాం పై విడుదల కాలేదు.
ఏజెంట్: హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఏజెంట్’. ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీపై అంచనాలు గట్టిగా ఉండటంతో భారీ ధరకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లివ్.. ఈ మూవీ థియేటర్లలో రిలీజై ఏడు నెలలు దాటినప్పటికి ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు.
ది కేరళ స్టోరీ: సుదిప్తో సేన్ దర్శకత్వం వహించిన మూవీ ‘ది కేరళ స్టోరీ’. ఎన్నో వివాదాల మధ్య రిలీజైన ఈ మూవీ.. థియేటర్లలో రిలీజై భారీ లాభాలను తెచ్చిపెట్టింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీ ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. లవ్ జిహాద్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఏ ఓటీటీ సంస్థ ముందుకు రాలేదు. దీంతో ఈ సినిమా రిలీజై దాదాపు 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఓటీటీలోకి మాత్రం రాలేదు.