K. Viswanath : కె. విశ్వనాధ్ చివరి సారిగా మాట్లాడిన మాటలు ఇవే !

by Prasanna |
K. Viswanath : కె. విశ్వనాధ్ చివరి సారిగా మాట్లాడిన మాటలు ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్ : కె . విశ్వనాథ్ చివరి సారిగా మాట్లాడినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'ప్రతి దేవాలయంలోనూ అర్చకులు ఉంటారు. అందులో ఒకరు దేవునికి ప్రసాదం పెట్టే బాధ్యతలను అప్పగిస్తారు. భగవంతుడికి ఏ సమయంలో ఏ ప్రసాదం పెట్టాలో అతని జాబ్. అలానే నేను కూడా దేవాలయంలో వంటవాడిని. ఇక్కడ నా దేవాలయం సినిమా. ప్రేక్షకులకు నేను అందించే నా సినిమాలే నేను చేసే వంట. వంట చేసే వ్యక్తి తన వంటలో ఎలాంటి కల్తీ, విషపదార్థాలు కలపడో అలాగే తాను కూడా తన సినిమాలో స్వచ్ఛతను ఇష్టపడతానన్నారు. అదే నా వృత్తి.. ఈ పనిలో నాకు నాపై గట్టి నమ్మకం ఉందన్నారు. సంగీతం, సాహిత్యం మీద అభిమానం కంటే కూడా నాకు దైవ భక్తి మీద అభిమానం ఎక్కువ అన్నారు. నేను నమ్ముకున్న సిద్ధాంతం మీద నాకు నమ్మకం ఉందని కళాతపస్వి చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed