సిమ్రాన్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే!

by samatah |
సిమ్రాన్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్ : పంజాబీ ముద్దుగుమ్మ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేడు 47 వ వసంతలోకి అడుగుపెడుతున్న సిమ్రాన్, తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందం నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన, నడుము అందాలతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ, టాప్ స్టార్ హీరోస్ అందరిసరసన ఆడిపాడింది. ఈ నటికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

1976 ఏప్రిల్ 4న అశోక్ నావల్, శారద దంపతులకు పంజాబీ కుటుంబంలో ముంబైలో జన్మించింది సిమ్రాన్. తర్వాత అక్కడే డిగ్రీ పూర్తి చేసి మోడలింగ్ రంగంలో పనిచేసిన తర్వాత సినిమాల్లోకి వచ్చింది. సనమ్ హార్ జాయే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత దూరదర్శన్ లో వచ్చిన సూపర్ హిట్ ముకాబుల కార్యక్రమంలో కూడా పాల్గొనింది. ఇక దక్షిణాది విషయానికి వస్తే.. ఇంద్రప్రస్థం అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె 1997లో అబ్బాయిగారి పెళ్లి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేశ్ బాబు ఇలా చాలా నటుల సరన నటించి హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత 2003లో దీపక్ బగ్గాను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది సిమ్రాన్.

Next Story

Most Viewed