- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పక్కా ప్లాన్‌తో వస్తున్న పవన్ కల్యాణ్ హీరోయిన్.. టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయనుందా !

దిశ, సినిమా : భాషతో సంబంధం లేకుండా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ, కోలీవుడ్‌లోనే ఎక్కువ ఫేమస్ అయింది బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. గతంలో నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘శ్రీకారం’తోనూ అలరించింది. కాగా ఈ రెండు మూవీస్‌లోనూ హిట్ అందుకోలేకపోయింది. తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన్నప్పటికీ ఎందుకో కానీ తెలుగులో సక్సెస్ కాలేకపోయింది. అలా వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొన్న ప్రియాంక టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చి, కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. తమిళంలో ఆమెకు వరుస అవకాశాలే వచ్చాయి. అయితే ప్రస్తుతం మళ్లీ తెలుగు తెరపై మనసు పారేసుకున్న ఈ అమ్మడు ఇక్కడ సెట్ అయిపోవాలని భారీ ప్లానే చేస్తోందట.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ప్రియాంక ఈసారి పక్కా ప్లాన్‌తో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయాలని భావిస్తోందట. శ్రీలీలకు దీటుగా తెలుగు తెరపై సత్తా చాటాలని కలలు కంటోందట. ఇక ఇప్పటికే ఈ అమ్మడు నానికి జోడీగా ‘సరిపోదా శనివారం’లో నటిస్తోంది, ఆగస్టు 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘OG’లోనూ నటిస్తోంది ప్రియాంక, కాగా ఇది సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ రెండు మూవీస్‌పై భారీ అంచనాలు ఉండగా, సక్సెస్ అయితే మాత్రం తనకు వరుస అవకాశాలు, హిట్లు దక్కుతాయని, ఆ తర్వాత టాలీవుడ్‌లోనూ ఓ వెలుగు వెలుగొచ్చని పెద్ద ప్లానే చేస్తోందట ప్రియాంక అరుళ్ మోహన్.