అప్పుడు రూ.500 కోసం హోటల్లో హోస్ట్! .. కట్ చేస్తే ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.4 కోట్లు..

by Kavitha |
అప్పుడు రూ.500 కోసం హోటల్లో హోస్ట్! .. కట్ చేస్తే ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.4 కోట్లు..
X

దిశ, సినిమా: ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత మన అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అక్కినేని హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి కుటుంబ సమేతంగా పెళ్లి కూడా చేసుకుంది. కానీ మూడునాళ్ళ ముచ్చటగా విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో మయోసైటీస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ మళ్ళీ సెకెండ్ ఇన్నీంగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది.

ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ స్టార్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఉన్నత చదువులు, జీవితంలో స్థిరపడాలని ఆశయం ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మధ్యలో ఆపేసి కుటుంబానికి అండగా నిలిచినందుకు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోని.. ప్రస్తుతం పాన్ ఇండియన్‌ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకొని దూసుకుపోతుంది. దేశంలోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న నటిగా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ రేంజ్‌లో ఉన్న సమంత కాలేజీ రోజుల్లో 500 కోసం హోటల్ ఈవెంట్ హోస్ట్ గా పని చేసిందట. కానీ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ తన సినీ కెరీర్ లో రూ.101 కోట్ల ఆస్తిని సంపాదించిందని టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.





Next Story

Most Viewed