గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

by Disha Web Desk 6 |
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది సెలబ్రీటీలు ఇండస్ట్రీకి దూరమయ్యాక తమ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయారు. అయితే కొందరైతే మరీ గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వారిని చూసిన వారు వీళ్లు కూడా ఇండస్ట్రీకి చెందినవారా అని షాక్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీ సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తండ్రికి ఇండస్ట్రీతో సంబంధం లేకున్న ఆమె తల్లి మాత్రం ఒకప్పటి స్టార్ హీరోయిన్, అలాగే ఆమె అక్క కూడా హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది.

అయితే ఒకప్పటి హీరోయిన్ రాధ చిన్న కూతురు తులసి నాయర్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు చిత్రాల్లో నటించింది. మణిరత్నం తీస్తున్న ఓ సినిమాకు ఆడిషన్ ఇవ్వడంతో అలా కాదల్ మూవీకి హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. దీనిని కడలి పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. కానీ ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత 2014లో యాన్ అనే మరో సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇక పెద్దగా ఫేమ్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇటీవల తన అక్క కార్తీక పెళ్లిలో తులసి కనిపించింది. ఇక ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అవి చూసిన వారు గుర్తుపట్టులేకపోయారు. ఆ తర్వాత ఆమె అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.Next Story

Most Viewed