- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కియారా భర్తతో రాశి ఖన్నా పబ్లిక్‌లోనే అలా చేస్తున్న వీడియో వైరల్.. డైవర్స్ పేపర్స్ రెడీ!

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ వినయ విధేయ రామతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్ పీక్స్‌లో ఉన్న క్రమంలోనే హీరో సిద్ధార్థ్ మాల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట నిత్యం ఫొటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను మెప్పిస్తారు. ఈ క్రమంలోనే.. తాజాగా, కియారా భర్త మరో హీరోయిన్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని ఓ ఈవెంట్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. సిద్ధార్థ్, రాశి ఖన్నా కాంబోలో రాబోతున్న చిత్రం ‘యోధ’. ఇందులో దిశా పటాని ఓ కీలక పాత్రలో నటిస్తుంది. యోధ మార్చి 15న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో రాశి ఖన్నా, సిద్దార్థ్ కలిసి రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా వీరిద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. దీంతో అది చూసిన కియారా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు పెళ్లైన జంటగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటూ? మండిపడుతున్నారు. అంతేకాకుండా కియారాకు అన్యాయం చేయకండి.. ఆమెతోనే మీరు ఇలా తిరగండి అంటూ సిద్దును వేడుకుంటున్నారు. ఇంకా కొందరు నెటిజన్లు మాత్రం కియారా డైవర్స్ పేపర్స్ రెడీ చేసుకుంటుందంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.