హోటల్‌లో ఆ పని చేసిన మహేష్ బాబు అన్న కూతురు వీడియో.. సోషల్ మీడియా షేక్

by Dishafeatures1 |
హోటల్‌లో ఆ పని చేసిన మహేష్ బాబు అన్న కూతురు వీడియో.. సోషల్ మీడియా షేక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ లో ఉన్న అందరు సీనియర్ హీరోలకేల్ల సూప‌ర్‌స్టార్ కృష్ణకు ఉన్న స్టార్‌డ‌మ్‌, ఫ్యాన్ బేస్ చాలా ప్రత్యేకం. ఇక ఆయ‌న త‌ర్వాత మ‌హేశ్‌బాబు కృష్ణ వార‌స‌త్వాన్ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తూ ఆ ఇమేజ్‌ను డ‌బుల్ చేశారు. అయితే మ‌ధ్యలో కృష్ణ రెండో కుమారుడు ర‌మేశ్ బాబు కూడా కొన్ని సినిమాల్లో నటించాడు కానీ కంటిన్యూ కాలేకపోయాడు. చివ‌ర‌గా ‘ఎన్‌కౌంట‌ర్’ అనే చిత్రంలో తండ్రితో క‌లిసి న‌టించిన ర‌మేశ్‌బాబు ఆ త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇక తాజాగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీతో వచ్చి మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని ‘కుర్చీ మ‌డ‌త పెట్టి’ పాట సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఈ పాటకి అన్నీ ఇండ‌స్ట్రీల నుంచి అద్భుతమైనా రెస్పాన్స్ రావ‌డ‌మే గాక ఆ పాట‌పై తెగ‌ రీల్స్ చేస్తున్నారు.

ఇప్పటికే సితార పాప కూడా ఈ పాటకు డ్యాన్స్ చేసినప్పటికి ఈ లిస్టులోకి మ‌హేశ్‌బాబు అన్న ర‌మేశ్‌బాబు కూతురు భార‌తి కూడా చేరింది. తాజాగా ఓ హోటల్ లో వంట చేస్తు.. ‘కుర్చీ మ‌డ‌త పెట్టి’ పాటకు డ్యాన్స్ చేసింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. కాగా ఈ రీల్‌లో డ్యాన్స్‌ చూసిన‌వారంతా ర‌మేశ్‌బాబు కూతురిలో ఇంత టాలెంట్ ఉందా శ్రీలీల రేంజ్‌లో చేసిందంటూ మెచ్చుకుంటున్నారు.



Next Story

Most Viewed