ఉత్కంఠరేపుతున్న 'సైంధవ్' పోస్టర్.. వెంకీ మామ సినిమాకు Title ఫిక్స్

by Prasanna |
ఉత్కంఠరేపుతున్న సైంధవ్ పోస్టర్.. వెంకీ మామ సినిమాకు Title ఫిక్స్
X

దిశ, సినిమా : సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్‌లో వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మేరకు మూవీకి 'సైంధవ్' అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తాజాగా అనౌన్స్ చేసిన దర్శకనిర్మాతలు.. ట్విట్టర్ వేదికగా వెంకటేష్‌కు ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా 'అతను డేంజరస్, డెడ్లీ అండ్ డిసైసివ్. వెంకీ మామ పాన్ ఇండియా సినిమా #SAINDHAV. ఏ న్యూ ఏజ్ యాక్షన్ ఫిల్మ్' అంటూ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఈ పోస్ట్‌లో క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక మంటల్లో తగలబడిపోతున్న కారు పక్కన చేతిలో గన్ పట్టుకుని నడుస్తున్న వెంకీ లుక్స్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తుండగా.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి :

Sunny Leone : సన్నగా మారిపోయిన సన్నీ.. ఫొటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Next Story