- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాటలు వదిలేసి పుచ్చకాయలు ఏరుకుంటున్న స్టార్ సింగర్..! వీడియో వైరల్

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సింగర్‌గా ఆమె ఎన్నో పాటలు పాడటంతో పాటుగా పలువురికి డబ్బింగ్ చెప్పి తన గొంతుతో అందరినీ మెప్పించింది. ఇండస్ట్రీలో సింగర్‌గా మంచి గుర్తింపు సాధించింది. అయితే ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం పలు టీవీ షోస్ అడపదడపా పాటలు పాడుతూ ప్రేక్షకుల మనసులు దోచేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది.
తాజాగా, సునిత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ అద్భుతమైన వీడియోను షేర్ చేసింది. ‘‘సాయంత్ర సమయంలో మొదటి సారి పుచ్చకాయలు కోశాను’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అందులో ఆమె చేతిలో సంత్రాలు పట్టుకుని మంచి పుచ్చకాయలను ఏరుకుంటూ కనిపించింది. ఒక దాన్ని కోసి అక్కడే తినేస్తూ వాతావరణాన్ని ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం సునీత షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక అది చూసిన కొందరు వ్యవసాయం చేసే పొలంలో చెప్పులు వేసుకోకూడదు అని కామెంట్లు పెడుతున్నారు.
Read More..
సమంత సిగ్గు వదిలేసి ఆ పని చేస్తే, టాలీవుడ్‌లో టాప్ రేంజ్ పక్కానంట!