విడాకులు తీసుకోబోతున్న స్టార్ వారసుడు.. అక్రమ సంబంధమే కారణమంటూ భార్య ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
విడాకులు తీసుకోబోతున్న స్టార్ వారసుడు.. అక్రమ సంబంధమే కారణమంటూ భార్య ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో చాలా మంది విడాకులు తీసుకోవడానికి సిద్దపడుతున్నారు. రోజు రోజుకు స్టార్ విడాకులు తీసుకోబోతున్న సెలబ్రిటీలు ఎక్కువవుతున్నారు తప్ప తగ్గడం లేదు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థలు రావడంతో భాగస్వామితో డైవర్స్ తీసుకుని విడిపోతున్నారు. నాగచైతన్య-సమంత విడిపోయినప్పటికీ నుంచి స్టార్ కపుల్స్ కూడా విడాకులు తీసుకోవడానికి ఆలోచించడం లేదు.

ఇటీవల స్టార్ హీరో ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కూడా భార్య సైంధవితితో విడిపోయి సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ మనవడు, నటుడు యువరాజ్ కుమార్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు. అయితే రాజ్ కుమార్‌కు ముగ్గురు కొడుకులు. శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్. రాఘవేంద్ర కుమారుడే ఈ యువ రాజ్ కుమార్.

అయితే యువ మైసూరుకు చెందిన శ్రీదేవి బైరప్పను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహమై నాలుగేళ్లు పూర్తి కావొస్తుండగా.. ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులకు దారి తీసింది. తనను శ్రీదేవి హింసిస్తుందంటూ విడాకుల పిటిషన్‌లో దాఖలు చేసి భార్యకు లీగల్ నోటీసులు పంపాడు. అంతేకాకుండా ఫ్యామిలీ కోర్ట్‌కు కూడా హారయ్యాడు. ఈ క్రమంలో యువరాజ్ తరపు న్యాయవాది శ్రీదేవి పై సంచలన ఆరోపణలు చేశాడు. తన క్లైంట్ భార్య అక్రమం సంబంధం పెట్టుకోవడం వల్లే విడాకుల నోటీసు పంపించినట్లు తనపై అమానుషంగా ప్రవర్తించిదని అన్నాడు. తన అక్రమ సంబంధం బయటపడకుండా యువ రాజ్‌కు ఓ నటితో అక్రమ సంబంధం అంటగట్టి ఆరోపిస్తుందని చెప్పుకొచ్చాడు.

ఈ విషయంపై యువ రాజ్ భార్య శ్రీదేవి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ‘‘ వృత్తిపరమైన అలంకారాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తి అందులో నిజం లేకుండా బహిరంగంగా ఒక మహిళ అవమానించేలా మాట్లాడటం దురదృష్టకరం. చాలా బాధాకరమైనది ఈ సంఘటన. గత కొన్ని నెలలుగా నేను అనుభవించిన అన్ని బాధలను బయటకు చెప్పకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు నేను పూర్తిగా మౌనంగా ఉన్నాను. కానీ నా గౌరవాన్ని, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరం. యువరాజ్‌కు ఒక నటితో అక్రమ సంబంధం ఉంది. నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని శ్రీదేవి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. విడాకులు కన్ఫర్మ్ అని అంటున్నారు.

Next Story

Most Viewed