విజయ్ ‘గోట్’ మూవీ నుంచి రెండో పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

by Prasanna |
విజయ్ ‘గోట్’ మూవీ నుంచి రెండో పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే..?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. సైంటిఫిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకుంది.

విజయ్ పుట్టినరోజు కానుకగా, మేకర్స్ ‘The GOAT Bday Shots’ యొక్క స్పెషల్ గ్లింప్స్​ రిలీజ్ చేశారు. విజయ్ ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. డ్యూయల్ రోల్లో బైక్ పై విజయ్ యాక్షన్​ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ మూవీ నుంచి సెకెండ్ సింగిల్ ను విడుదల చేసారు.

ఈ మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ‘చిన్నచిన్నకంగాళ్’ అనే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. విజయ్ ఈ ఎమోషనల్ ఫ్యామిలీ సాంగ్ ని , యువన్ శంకర్ రాజాతో కలిసి పాడారు. ఈ పాటకు కబిలన్ వైరముత్తు, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.Next Story

Most Viewed