ఆకట్టుకుంటున్న ‘ఖుఫియా’ ట్రైలర్.. అదరగొట్టేసిన టబు

by Anjali |
ఆకట్టుకుంటున్న ‘ఖుఫియా’ ట్రైలర్.. అదరగొట్టేసిన టబు
X

దిశ, సినిమా: స్టార్ నటి టబు వృధ్యాప్య దశలోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల లేడీ ఓరియంటెడ్, హారర్ మూవీస్ చేస్తున్న ఆమె తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విశాల్ భ‌ర‌ద్వాజ్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఖుఫియా’లోనూ ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా ఆ మూవీనుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పూర్తి యాక్షన్ మోడ్‌లో ఉన్న ట్రైలర్ ప్రేక్షకుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తోపాటు విడుదల చేసిన టీజ‌ర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్, వామికా గబ్బి, త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టిస్తున్న ఆ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

Next Story