‘ప్రేమిస్తున్నా’.. ‘బేబీ’ థర్డ్ సింగిల్ బాగా నచ్చింది: రష్మిక

by Disha Web Desk 9 |
‘ప్రేమిస్తున్నా’.. ‘బేబీ’ థర్డ్ సింగిల్ బాగా నచ్చింది: రష్మిక
X

దిశ, సినిమా: మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకులనుంచి భారీ రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా ‘ప్రేమిస్తున్నా’ అనే మూడో పాటను రష్మిక చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. కాగా ఈ పాట తనకు బాగా నచ్చిందని, ఆనంద్‌ మ్యూజిక్‌ టేస్ట్‌కు పెద్ద అభిమానినంటూ ‘బేబీ’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది రష్మిక.

అలాగే ఇలాంటి ఆర్గానిక్ లవ్ స్టోరీస్ చాలా అరుదుగా వస్తుంటాయని మారుతి చెప్పగా.. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందన్నాడు సందీప్ రాజ్. చివరగా మాట్లాడిన దర్శకనిర్మాతలు సాయి రాజేష్‌, ఎస్కేఎన్.. ‘రష్మిక లాంటి స్టార్‌ ఈ పాటను ప్రమోట్ చేయడం అవసరం. మా కోసం పిలవగానే వచ్చిన నటికి థాంక్స్. ఈ పాట బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం. జూలై 14న సినిమా రిలీజ్ చేయబోతున్నాం’ అని తెలిపారు.

Also Read..

థమ్స్ అప్ యాడ్ కోసం విజయ్ దేవరకొండ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

Next Story