- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
సినీ నటి సాయి పల్లవికి హైకోర్టులో చుక్కెదురు

దిశ, తెలంగాణ బ్యూరో : కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై సినీ నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల దుమారం మరో కీలక మలుపు తిరిగింది. సాయి పల్లవి వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నాయకులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని, కేసు నమోదు చేసిన పోలీసులు.. గత నెల 21న సాయి పల్లవికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను రద్దు చేయాలని సినీ నటి సాయి పల్లవి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గురువారం విచారించిన హైకోర్టు.. సాయి పల్లవి వేసిన పిటిషన్ ను కొట్టి వేస్తూ అభ్యర్థనను తోసి పుచ్చింది. 'విరాటపర్వం' సినిమా ప్రచారంలో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో 'కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ గురించి విన్నానని, తాను మాత్రం న్యూట్రల్ గా ఉంటానని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడారు. 90లో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చిత్రంలో చూపించారని, కొవిడ్ సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలిస్తుండగా దాని డ్రైవర్ ఓ ముస్లిం అని, కొంతమంది డ్రైవర్ ను కొట్టి జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారని, అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగినదానికి తేడా ఏముందంటూ సాయి పల్లవి వ్యాఖ్యానించారు. మంచిగా ఉండాలి.. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై భజరంగ్ ధళ్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై సాయిపల్లవి హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.