ఆ హీరోతో ఎఫైర్ కారణంగా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇప్పుడేమో అలా..

by Javid Pasha |
ఆ హీరోతో ఎఫైర్ కారణంగా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇప్పుడేమో అలా..
X

దిశ, సినిమా : గ్లామర్ ఫీల్డ్ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొందరు వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే.. మరి కొందరు ఆఫర్లు లేక అవస్థలు పడుతుంటారు. ఎంత కష్టపడినా గుర్తింపు రాక కొందరు ఇబ్బంది పడుతుంటే.. వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడంలో మరి కొందరు తప్పటడుగులు వేస్తుంటారు. ఇక పర్సనల్ లైఫ్‌లో చేసిన పొరపాట్లు, తప్పుల కారణంగా కెరీర్‌ను నాశనం చేసుకున్న నటీ నటులు లేకపోలేదు. అలాంటి వారిలో నిఖితా తుక్రాల్ ఒకరు.

నిఖితా తుక్రాల్ తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసింది. కానీ కన్నడ, తమిళంలో మాత్రం తన నటనతో మస్తు ఫేమ్ సంపాదించుకుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో మారు మోగిన ఆమె పేరు ఇప్పుడు వినిపించడమే మహా కష్టమైపోయింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగా ఈ అమ్మడు అప్పటికే పెళ్లైన ఒక కో- యాక్టర్‌ దర్శన్‌తో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం అతని భార్య విజయ లక్ష్మికి తెలియడంతో వివాదాలు చుట్టు ముట్టాయి.

సినీ నిర్మాతల సంఘం నిఖితను సినిమాల్లో అవకాశాలు ఇవ్వకుండా మూడేండ్లు నిషేధం విధించింది. దీంతోపాటు ఇండస్ట్రీలో అనేక అవమానాలు ఎదురయ్యాయి. ఫ్యాన్స్‌లో కూడా గౌరవం తగ్గిపోయింది. ఈ కారణంగా కెరీర్ నాశనం అయి, సినిమాలకు దూరం అయిన నిఖితా తుక్రాల్ మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే సాహసం చేయలేదు. 2017లో ప్రముఖ వ్యాపార వేత్త గగన్ దీప్ సింగ్ మాగోను పెండ్లి చేసుకున్న ఆమె, ప్రజెంట్ ఓ కూతురికి తల్లిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

Next Story

Most Viewed