ప్లీజ్ అనగానే ఆ పార్ట్ చూపించిన హీరోయిన్.. వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో.. (పోస్ట్ వైరల్)

by sudharani |   ( Updated:2024-02-27 14:44:55.0  )
ప్లీజ్ అనగానే ఆ పార్ట్ చూపించిన హీరోయిన్.. వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో.. (పోస్ట్ వైరల్)
X

దిశ, సినిమా: ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ వంటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియాంక అరుల్ మోహన్. శివ కార్తకేయన్ ‘డాన్’ చిత్రంతో తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలోనే పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’, నేచులర్ స్టార్ నాని ‘సరిపోధా శనివారం’ మూవీస్‌తో బిజీగా ఉంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని కోరికను తీర్చి ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే..

నిన్న ఆదివారం ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది ప్రియాంక. ఈ మేరకు.. అభిమానులు తనను ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పారు. మీ ట్రెడిషనల్ లుక్‌కు మేము ఫిదా అవుతున్నాము అని వాళ్లు ఇచ్చిన కామెంట్లకు.. ‘థాంక్యూ’ అంటూ లవ్ సింబల్స్‌తో రిప్లై ఇచ్చింది ప్రియాంక. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. ‘మీ వేళ్లను చూడాలని ఉంది.. ప్లీజ్ వాటిని చూపించండి’ అంటూ కాస్త ఫన్నిగా అడిగాడు. ఇక వెంటనే అభిమాని కోరికను తీరుస్తూ.. తన చేతి వేళ్లను ఫొటో తీసి షేర్ చేసింది. అయితే.. అందులో ప్రియాంక వేళ్లకు గోళ్లు కూడా ఉన్నాయి. దీంతో ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ‘వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. దానిసి సంబంధించిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Next Story