ది ఘోస్ట్.. ట్విట్టర్‌ను షేక్ చేస్తోన్న కింగ్ నాగార్జున

by Disha Web |
ది ఘోస్ట్.. ట్విట్టర్‌ను షేక్ చేస్తోన్న కింగ్ నాగార్జున
X

దిశ, వెబ్‌డెస్క్: కింగ్ నాగార్జున హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ది ఘోస్ట్'. యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ అంచనాలున్న ఈ మూవీ దసరా సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నాగార్జునకు ఎంత వరకు కలిసి వచ్చిందో తెలుసుకుందాం..

ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్‌షో పడిపోయింది. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా తెలియజెస్తున్నారు. ఇది డీసెంట్ మూవీ అని.. యాక్షన్ సీన్స్ బాగున్నాయని తమ అభిప్రాయాలను తెలియజెస్తు్న్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ మాత్రం కాస్తా డ్రామా ఎక్కువైందని, సెకండాఫ్‌లో యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతున్నాయని చెబుతున్నారు. ఇంటెర్వెల్ మాత్రం పవర్ ప్యాక్‌గా ఉందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఓవరల్‌గా సినిమా బాగుంది అంటున్నారు ప్రేక్షకులు.

ALSO READ : గాడ్ ఫాదర్‌కు ఇదే హైలెట్.. సత్యదేవ్ లేకపోతే

Next Story

Most Viewed