రోజు చివరలో అలా చేసి అలసిపోవడంతో వచ్చే అనుభూతిని మించింది మరొకటి లేదు.. శృతి హాసన్!

by Disha Web Desk 6 |
రోజు చివరలో అలా చేసి అలసిపోవడంతో వచ్చే అనుభూతిని మించింది మరొకటి లేదు.. శృతి హాసన్!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శృతి హాసన్, కమల్ హాసన్ పెద్ద కూతురు గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. హీరో సిద్ధార్థ్ ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు ప్రజల ముందుకు వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రవితేజ, నాగచైతన్య, చిరంజీవి వంటి టాలీవుడ్ స్టార్స్‌తో నటించడంతో అమ్మడుకి క్రేజ్ మరింత పెరిగింది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. శృతి హాసన్ ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్- 22న విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అడివి శేష్ ‘డెకాయిట్ తో తొందరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ అలా కష్టపడి పని చేయడమే నాకు ఇష్టం. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్లడంతో వచ్చే ఫీలింగ్ కంటే మరేది ముఖ్యం కాదు. రోజు చివరిలో అలా అలసిపోయిన అనుభూతి కలగలేదంటే అదే నాకు చెత్త అనుభవంగా నాకు అనిపిస్తుంది. మనం ఇంట్లో ఉన్నట్లు ఆఫీసులో ఉండలేం.

ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. కాబట్టి సినిమాల విషయంలో కూడా అలాగే ఉండాలి. నేను కీలక పాత్రలో చేసినప్పుడు.. ఆ అనుభవం ఒకలాగ ఉంటుంది. అలాగే ఇతరులతో కలిసి నటించినప్పుడు భిన్నంగా అనిపిస్తుంది. నేనైతే ఎలా నటించినా సరే నా పాత్రకు న్యాయం చేయడానికి వంద శాతం కష్టపడటానికి ఎక్కువ ఇష్టపడతాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండటంతో అది తెలుసుకున్న వారు అమ్మడు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed