- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లక్ష్యం మీద గురి లేనప్పుడు.. ప్రకృతి కూడా సహకరించదు : విజయ్ సేతుపతి

దిశ, సినిమా: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి తన ట్యాలెంట్‌తో ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎదిగాడు విజయ్ సేతుపతి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ ఎలాంటి తేడా లేకుండా భారీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రజంట్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న విజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు పంచుకున్నాడు..‘ఏదైనా ఒక విషయాన్ని మనసారా అనుకుంటే, వెంటనే నెరవేర్చడానికి భగవంతుడు రెడీగా ఉంటారు. దీనికి మనం చేయాల్సిందల్లా ఒకటే. మనకేం కావాలో స్పష్టంగా ఆలోచించుకోవాలి. దాని మీద మనసు లగ్నం చేయాలి.
అలా నేను నటుడు కావాలని అదేపనిగా అనుకుంటూ ఉండేవాన్ని. అందుకే ఇవాళ ఈ పొజిషన్‌లో ఉన్నానని గర్వంగా చెబుతా. మన లక్ష్యం మీద దృష్టి లగ్నం చేసినప్పుడే సగం పని పూర్తవుతుందని నమ్ముతా. ఒకవేళ అనుకున్న పని నెరవేరకుంటే ఆ తప్పు మనదే అవుతుంది. లక్ష్యం మీద గురి లేనప్పుడు దానికి ప్రకృతి కూడా సహకరించదు’ అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పారు విజయ్.