- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అది అడిగి విద్యాబాలన్‌ను వేధించిన వ్యక్తి ఆమె ఏం చేసిందంటే.. వీడియో వైరల్

దిశ, సినిమా: సమయం .. సందర్భం ఏంటి అని తెలుసుకోకుండా కొంత మంది ఫ్యాన్స్ తమ హీరో హీరోయిన్స్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా ఇలాంటి సంఘటనే ఎదురుకుంది. రీసెంట్‌గా గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ 26 ఫిబ్రవరి 2024న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఫిబ్రవరి 27న జరిగాయి. కాగా ఈ అంత్యక్రియలకు నటి విద్యాబాలన్ కూడా ఆయనను చివరి చూపు చూసేందుకు వచ్చింది. అక్కడ ఆమె అభిమానుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. కాగా ఈ వీడియోలో నటి అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు. విద్యతో పాటు వచ్చిన ఓ అమ్మాయి ఆ వ్యక్తిని పదేపదే తిరస్కరిస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘సమయం ఏమిటో, స్థలం ఏమిటో అర్థం చేసుకోని వ్యక్తులు కొందరు ఉన్నారు’ అంటూ ‘కొంతమంది హృదయం లేదు..వారికి సెల్ఫీ మాత్రమే కావాలి’ అని కొందరు.. ‘ఆమె సెల్ఫీ కి బదులుగా చెంపదెబ్బ కొట్టాలి’ అని రాసుకొచ్చారు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.