చేతులు జోడించి వారందరికీ క్షమాపణలు చెప్పిన 12th ఫెయిల్ హీరో.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 6 |
చేతులు జోడించి వారందరికీ క్షమాపణలు చెప్పిన 12th ఫెయిల్ హీరో.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా: విక్రాంత్ మస్సే ఇటీవల హీరోగా నటించిన చిత్రం 12th ఫెయిల్. ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ 27న విడుదలై ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఈ చిత్రం ఓటీటీలోనూ విడుదలై మంచి రెస్పాన్స్‌ను సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా, విక్రాంత్ మస్సే తన ట్విట్టర్‌లో క్షమాపణలు కోరుతూ ఓ పోస్ట్ షేర్ చేయడంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ‘‘2018లో నా ట్వీట్లలో ఒక దానికి సంబంధించి, నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. హిందూ సమాజాన్ని బాధపెట్టడం, కించపరచడం లేదా అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదు. కానీ నేను హాస్యాస్పదంగా చేసిన ట్వీట్ గురించి ఆలోచించినప్పుడు, నేను దాని అంతరార్ధాన్ని కూడా గ్రహించాను. వార్తాపత్రికలో ప్రచురించబడిన కార్టూన్‌ను జోడించకుండా అదే చెప్పవచ్చు.

నేను అన్ని మతాలు, విశ్వాసాల పట్ల గౌరవభావం తో ఉన్నాను. నా ట్వీట్ల వల్ల గాయపడిన ప్రతి ఒక్కరికి నేను చాలా వినయంతో క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసినట్లుగా, నేను అన్ని విశ్వాసాలు, మతాలను సాధ్యమైనంత ఉన్నతమైన గౌరవంతో కలిగి ఉంటాను. మనమందరం కాలంతో పాటు పెరుగుతాము, మన తప్పులను ప్రతిబింబిస్తాము. ఇది నాది’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం విక్రాంత్ మస్సే పోస్ట్ చూసిన వారంతా ఇన్నేళ్లకు తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.


Next Story

Most Viewed