- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మిస్ క్యారేజ్ అయింది అంటూ.. పిల్లల పై స్పందించిన వరుణ్ సందేశ్ దంపతులు..

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘హ్యాపీడేస్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనంతరం ‘కొత్త బంగారు లోకం’ మూవీ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తద్వార వరుస సినిమాలు చేసినప్పటికి అంతగా ఆకట్టుకోలేక పొయ్యాయి. ప్రజంట్ సినిమాకు దూరంగా ఉంటున్నాడు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే వరుణ్ సందేశ్ నటి వితికా షేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా సోషల్ మీడియాలో ఈ జంట చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా వితికా మాత్రం తనకు సంబంధించిన ప్రతి ఒక్క అప్‌డేట్ ని తన ఫ్యాన్స్ తో పంచుకుంటు ఉంటుంది.
అయితే వీరిద్దరికి పెళ్లి జరిగి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు సంతానం లేదు. ఈ విషయం పై చాలా వార్తలు చక్కర్తు కొట్టగా.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తమ పిల్లల విషయం గురించి స్పందించారు.. ‘పెళ్లి జరిగి దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతుంది. పిల్లల గురించి తరచూ మాకు అందరి నుండి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మేము పిల్లల గురించి ఏ విధమైనటువంటి ప్లాన్ చేయలేదు. కానీ 2018 వ సంవత్సరంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను కానీ 40 డేస్ తర్వాత మిస్ క్యారేజ్ అయింది. అలా మిస్ క్యారేజ్ అయిన తర్వాత మేము అమెరికా నుంచి ఇండియా వచ్చేసాం. కొద్దిరోజులు మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వడానికి సమయం పట్టింది. ఇలా మేం పిల్లల గురించి ప్లాన్ చేయకుండానే మాకు పిల్లలు అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అవకాశం కోల్పోయాము. ప్రజంట్ అదే ప్లాన్ లో ఉన్నాము త్వరలో మీకు శుభవార్త చెబుతాం’ అని తెలిపారు.