రాజ్ తరుణ్‌తో సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. చాందినీ చౌదరి ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |
రాజ్ తరుణ్‌తో సినిమాలు చేయకపోవడానికి కారణం అదే..  చాందినీ చౌదరి ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా ఈ అమ్మడు యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన నటించింది. ఆ తర్వాత 2015లో వచ్చిన కేటుగాడు మూవీతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. లై, హైరా బ్రిడ్జి, కుందనపు బొమ్మ, సమ్మతమే, గామి వంటి మూవీస్ చేసింది. ముఖ్యంగా ఈ అమ్మడు చేసిన కలర్ ఫొటో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో చాందిని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో వెబ్ సీరిస్‌ కూడా చేస్తూ దూసుకుపోతుంది. అయితే చాందిని పోలీస్ ఆఫాసర్‌గా నటించిన యేవమ్ అనే మూవీ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిని రాజ్ తరుణ్‌తో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో రివీల్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా రాజ్ తరుణ్‌తో హిట్ షార్ట్ ఫిలిమ్స్ చేసిన మీరు సినిమా ఎందుకు చేయలేదు అని యాంకర్ ప్రశ్నించగా.. చాందిని స్పందించింది. ‘‘అయ్యే కలిసి చేయడానికి సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను. రాజ్ తరుణ్ హీరోగా నటించిన మొదటి మూడు సినిమాల్లో నాకు హీరోయిన్‌గా నటించేందుకు ఆవకాశాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు నేను వాటిలో నటించలేకపోయినా. ఆ తర్వాత వేర్వేరు దారుల్లో సినిమాలు చేస్తున్నాము కాబట్టి మళ్లీ రాజ్ తరుణ్‌తో అవకాశం రాలేదు. వస్తే కచ్చితంగా చేస్తాను’’ అని చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed