ఆ సమయం ఎంతో కష్టంగా గడిచింది.. విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్..!

by sudharani |
ఆ సమయం ఎంతో కష్టంగా గడిచింది.. విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్..!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలిసిందే. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అనతికాలంలోనే మంచి స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇక ఏడేళ్లు ప్రేమలో ఉన్న సామ్, చైలు.. పెద్దల సమక్షంలో 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత 2021లో విడిపోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఫ్యాన్స్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టారు.

ఇక విడాకుల అనంతరం ఎవరి ఫ్రొఫెషన్‌లో వారు బిజీ అయిపోయారు. కానీ సమంత మాత్రం గత సంవత్సరం మయోసైటిస్ అనే వ్యాధీతో బాధపడిన విషయం తెలిసిందే. ఇక ఆ సమయంలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి.. మూవీస్‌కు కొంత కాలం గ్యాప్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం మళ్లి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించే ఒక పాడ్ కాస్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులోనే పరోక్షంగా మరోసారి తన విడాకుల గురించి మాట్లాడింది సామ్.

‘నాకు బాగా గుర్తుంది. మయోసైటిస్ సమస్య రావడానికి సరిగ్గా ఏడాది ముందు నాకు ఎంతో కష్టంగా గడిచింది. నేను నా మ్యానేజర్ హిమంక్‌తో ముంబాయ్ నుంచి ప్రయాణిస్తున్న సమయంలో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని తనతో చెప్పాను. చాలా కాలం తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నాను. ఫైనల్‌గా నేను ప్రశాంతంగా ఊరిపి పీల్చుకోగలుగుతున్నాను. తృప్తిగా నిద్ర పోతున్న. నా పని మీద నేను దృష్టి పెట్టగలుతున్నాను అని అనిపించే లోపే ఈ వ్యాధి నాకు సోకినట్లు తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. సమంత విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధీ రావడంతో.. ఆ సమయంలోనే చాలా కష్టంగా గడిచిందని చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed