టాలీవుడ్ స్టార్ హీరో మా బావ ఆయనే నా లవర్ కూడా.. బర్రెలక్క ఆసక్తికర కామెంట్స్!

by Disha Web Desk 6 |
టాలీవుడ్ స్టార్ హీరో మా బావ ఆయనే నా లవర్ కూడా.. బర్రెలక్క ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగ యువతి బర్రెలక్క (శిరీష) నోటిఫికేషన్ రాక బర్రెలు కాస్తున్నా ఫ్రెండ్స్ అంటూ ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇటీవల ఏకంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి బరిలోకి దిగి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బర్రెలక్క గెలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్రెలక్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీకు లవర్ ఉన్నాడా? ఎవరైనా క్రష్ ఉన్నారా అని యాంకర్ అడగ్గా ‘‘హీరో మహేష్ బాబు మా బావ, లవర్ కూడా ఆయనే. నా క్రష్ కూడా అతనే. డిపార్మెంట్ డ్రెస్సులో మహేష్ బాబు గారు చాలా ఇష్టం. పోలీసు అవ్వాలని ఆలోచన కూడా మహేష్ బాబు డిపార్మెంట్ డ్రెస్ వల్లే వచ్చింది.

అలాగే ఆయన సినిమాలన్నీ చూశాను. సాయికుమార్ గారు సినిమాలన్నా.. ఆయన డైలాగ్స్ అన్నా చాలా ఇష్టం. ఇక బయట ఎవరిని ప్రేమించలేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే అలాంటి వాటి జోలికి పోలేదు. నేను పెళ్లి చేసుకోబోయేవాడు పెద్దగా చదువు కోకపోయిన, ఆస్తిపాస్తులు లేకపోయినా, నన్ను మా అమ్మను వాళ్ల అమ్మను బాగా చూసుకోవాలి. మా అమ్మకు అతడి అమ్మకు సమానమైన ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇంతకు మించి మంచి లక్షణాలు మరీ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి భర్త వస్తే చేసుకుంటాను. మన స్థోమతకు తగ్గట్టు ఆశపడాలి. దాంతోనే కలలను సాకారం చేసుకోవాలి’’ అంటూ చెప్పుకొచ్చింది.Next Story