అందరి ముందే నయనతారను డ్రెస్ మార్చుకోమన్న ఆ డైరెక్టర్!... అయ్యో ఎంత ఘోరం

by Kavitha |
అందరి ముందే నయనతారను డ్రెస్ మార్చుకోమన్న ఆ డైరెక్టర్!... అయ్యో ఎంత ఘోరం
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘లక్ష్మీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ అందరి స్టార్ హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషా చిత్రాల్లో కూడా నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది. ‘నాన్ రౌడీతాన్’ సినిమాలో నటిస్తున్నప్పుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు బాబుల తల్లి అయింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈ భామ మూవీలు చేస్తూ మరోవైపు ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్య్వూలో గజిని సినిమా టైమ్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ మురుగదాస్ ''చెన్నై వైఎంసీఏ గ్రౌండ్‌లో గజినీ సినిమాలో నన్ను విలన్లు వెంబడించే సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సీన్ లో నేను పరిగెడుతున్నప్పుడు మురుగదాస్ కట్ కట్ చెప్పారు. ఆ సమయంలో నేను ధరించిన చొక్కా వల్ల ఆ సీన్‌లో కాస్త అసభ్యత ఎక్కువగా అన్పించిందని మురుగదాస్ ఇది చాలా అసభ్యకరంగా ఉంది. కాబట్టి నేను ఈ చొక్కాతో ఉండగా షార్ట్ తీయలేను. మరో చొక్కా వేసుకో అని అడిగాడు. అయితే నయన్.. నా దగ్గర వేరే చొక్కా లేదు. చివరి క్షణంలో ఇలా ఎందుకు చెబుతున్నారు.. నేను వేరే బట్టలు కూడా తీసుకురాలేదు.. కనీసం మార్చుకోవడానికి క్యారవాన్ కూడా లేదని చెప్పగా.. వెంటనే మురుగదాస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెళ్లి ప్లాట్‌ఫాంపై ఓ షర్ట్‌ కొన్నాడంట. తర్వాత క్యారవాన్ లేకపోవడంతో అక్కడ పార్క్ చేసిన కారు వెనకాలే వెళ్లి క్లోసెట్ లో నిలబడి వేరే షర్ట్ వేసుకున్నాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

Next Story

Most Viewed