బాలీవుడ్ దర్శకుడు మూడో మీటింగ్‌లోనే నన్ను రేప్ చేశాడు: పాయల్ ఘోష్

by Disha Web Desk 7 |
బాలీవుడ్ దర్శకుడు మూడో మీటింగ్‌లోనే నన్ను రేప్ చేశాడు: పాయల్ ఘోష్
X

దిశ, సినిమా: ఎన్‌టీఆర్ హీరోగా నటించిన ‘ఊసరవెళ్లి’ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన పాయల్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె ఇటీవల సౌత్ సినిమాల గురించి పదేపదే పాజిటివ్‌గా మాట్లాడటంతో కొంత మంది ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా వీటిపై స్పందించిన పాయల్.. ‘నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్లలో, అగ్ర దర్శకులతో పనిచేశాను. కానీ, ఎవరూ నాతో అనుచితంగా ప్రవర్తించలేదు. అలాగే తారక్‌తో కూడా పనిచేశాను. ఆయన కూడా నాతో బాగున్నాడు. కానీ, బాలీవుడ్‌ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌‌తో పనిచేయకుండానే మూడో మీటింగ్‌లోనే నన్ను రేప్ చేశాడు. అలాంటప్పుడు నేను సౌత్ ఇండస్ట్రీ గురించి ఎందుకు గొప్పగా చెప్పకూడదు’ అని నెటిజన్లను ప్రశ్నించింది.


Next Story

Most Viewed