ఆ ఒక్క సినిమాతో బాలీవుడ్‌కు దూరమైన తమన్నా..

by Disha Web |
ఆ ఒక్క సినిమాతో బాలీవుడ్‌కు దూరమైన తమన్నా..
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు ఒక్కోసారి నచ్చని కథలను కూడా ఒప్పుకుంటారు. ఆ సినిమాలు ప్లాప్ అయితే అప్పటివరకు వారికి ఉన్న ఇమేజ్ మొత్తాన్ని పోగొట్టుకుంటారు. అలాంటి పనే మన మిల్క్ బ్యూటీ తమన్నా కూడా చేసింది. దెబ్బకు బాలీవుడ్‌కు దూరమైంది ఈ భామా.. టాలీవుడ్‌లో తన నటనతో, డాన్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మిల్క్ బ్యూటీ తమన్నా. అయితే ఈ అమ్మడు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలనుకుంది. స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌తో 'హిమ్మత్‌వాలా' సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేసింది. ఆ సమయంలో తమన్నా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్నా.. బాలీవుడ్‌లోకి బోలేడు ఆశలతో ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అక్కడ దారుణంగా ప్లాప్ కావడంతో తమన్నా ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఆ దెబ్బకు తమన్నాకు బాలీవుడ్‌లో మంచి గుర్తుంపు ఉన్న ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ అమ్మడు ఈ ఒక్క సినిమా చేయకుండా ఉంటే బాగున్ను, వేరే అవకాశాలు వచ్చుండేవని ఇప్పుడు బాధపడుతుందట.

Next Story