- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సామాజిక సందేశంతో ‘తేరా క్యా హోగా లవ్లీ’.. అలరిస్తున్న ట్రైలర్..

దిశ, ఫీచర్స్ : కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్‌తోపాటు మంచి మెసేజ్ ఇస్తుంటాయి. ఈ మద్య కాలంలో ఇలాంటి సిరీస్‌లు.. సినిమాలు చాలానే చూశాం. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నుండి ‘తేరా క్యా హోగా లవ్‌లీ’ అనే మూవీ రాబోతుంది.బల్విందర్ సింగ్ జంజువా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటించగ.. కరణ్ కుంద్రా, పవన్ మల్హోత్రా, గీతికా విద్య ఓహ్లియన్, రాజేంద్ర గుప్తా, అనిల్ రోధన్ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు.సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ మూవీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇక ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఇలియానా ఈ సినిమాలో డీగ్లామర్ పాత్రలో కనిపించి అభిమానులను థ్రిల్ చేసింది. అమ్మాయిల శరీర ఛాయ, వరకట్న సమస్య నేపథ్యంలో ఈ సినిమా తెర కెక్కినట్టు ట్రైలర్ లో తెలుస్తోంది. సీరియస్ ఇష్యూపై ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు బల్విందర్ సింగ్ జంజువా ఈ మూవీ తీసినట్లు తెలుస్తోంది.